Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ పంచమి సరస్వతీ జన్మదినం.... బుధవారం పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది

చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి జన్మదినం మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - శ్రీ పంచమి. దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మ

Advertiesment
శ్రీ పంచమి సరస్వతీ జన్మదినం....  బుధవారం పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది
, మంగళవారం, 31 జనవరి 2017 (22:42 IST)
చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి జన్మదినం మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - శ్రీ పంచమి. దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది.
 
శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన జ్ఞానం లభిస్తుంది. నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. మాఘ శుక్ల పంచమి నాడు, విద్యారంభం నాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబా ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. 
 
తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్లవస్త్రాలతో అర్చించాలి. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న... తదితర పదార్ధాలు నివేదన చేసి, ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్యని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. ఈ రోజున బాసర( వాసర) క్షేత్రంలో అమ్మవారి ఆవిర్భావాన్ని మహోత్సవంతో జరుపుతారు.
 
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి మాస ఫలితాలు : అవివాహితుల్లో ఉత్సాహం.. కలహాలు, చికాకులు... ధన లాభం...