Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి మాస ఫలితాలు : అవివాహితుల్లో ఉత్సాహం.. కలహాలు, చికాకులు... ధన లాభం...

ఈ మాసం అనుకూల, ప్రతికూలతల సమ్మేళనం. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. ధన మూలక సమస్యలు అధికం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో పట్టింపులు, కలహాలు, చికాకులు

Advertiesment
ఫిబ్రవరి మాస ఫలితాలు : అవివాహితుల్లో ఉత్సాహం.. కలహాలు, చికాకులు... ధన లాభం...
, మంగళవారం, 31 జనవరి 2017 (16:27 IST)
మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ మాసం అనుకూల, ప్రతికూలతల సమ్మేళనం. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. ధన మూలక సమస్యలు అధికం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో పట్టింపులు, కలహాలు, చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ అవసరం. కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. తరచూ ప్రయాణాలు చేస్తారు. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయినవారి రాక సంతోషాన్నిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఆందోళన తొలగి కుదుటపడుతారు. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణ, సంస్థల స్థాపనలకు అనుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
బంధుత్వాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. సమస్యలు సద్దుమణుగుతాయి. విలాస వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. నగదు, పత్రాలు జాగ్రత్త. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం. ప్రియతములను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష
ఈ మాసం ప్రతికూలతలే అధికం. ఆదాయం వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. అనుకోని సంఘటనలతో మనస్థిమితం ఉండదు. ఒత్తిళ్లు, ఆందోళనలు అధికం. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆత్మీయులు సాయం అందిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రకటనలు, దళారుల పట్ల అవగాహన ప్రధానం. వృత్తి, ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల్లో నిరుత్సాహం తప్పదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఈ మాసం శుభదాయకం. శుభకార్యాన్ని ఆడంబరంగా చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. ఆదాయం సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు, వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం కలిసివస్తుంది. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ధనలాభం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహా కంటే సొంత నిర్ణయాలే అనుకూలం. పదవుల నుంచి తప్పుకుంటారు. సంతానం భవిష్యత్ పట్ల శ్రద్ధ వహించండి. దంపతుల కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. పెట్టుబడులకు తరుణంకాదు. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులు, ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యహరాల ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం. ధనానికి లోటుండదు. పదవులు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. సంతానం విద్యా విషయాలపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఒక సంఘటన తీవ్ర ప్రభావం చూపుతుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. రిప్రజెంటేటివ్‌లకు శ్రమ అధికం. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
అన్నిరంగాల వారికి ఆశాజనకమే. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. రుణ, ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. విలువైన వస్తువులు, వాహనం కొనుగోలు చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడతాయి. గృహ నిర్మాణాల్లో స్వల్ప ఇబ్బందులు తప్పవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. సంకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన తొలుగుతుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వాగ్వాదాలు, అనవసర విషయాల్లో జోక్యం తగదు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు కృషి ఫలిస్తుంది. ఉన్నత పదవులు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు హోదా, మార్పు, స్థానచలనం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పుణ్యక్షేత్రం, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. నిర్మాణ రంగాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. 
 
మకరరాశి : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఈ మాసం శుభదాయకమే. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. వ్యూహాత్మకంగా వ్యహరిస్తారు. ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరిగినా ధనానికి లోటుండదు. వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. విలువైన కానుకలు అందిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. దంపతుల మధ్య తరచూ స్పర్థలు తలెత్తుతాయి. మీ ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోండి. ధనవ్యయం విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఏ విషయంలోనూ తొందరపడొద్దు. అయినవారే విమర్శిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సంతానం భవిష్యత్‌పై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, చికాకులు ఎదుర్కొంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ప్రముఖుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అవకాశాలు చేజారిపోతుంటాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలో.. తెలుసా..?