Publish Date: Thu, 18 Dec 2014 (21:30 IST)
Updated Date: Thu, 18 Dec 2014 (21:33 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. సాంబశివరావు గురువారం ఉదయం కంచిలోని కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా అక్కడకు చేరుకున్న ఆయన పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం కంచి కోటి పీఠాధిపతి చంద్ర శేఖర సరస్వతిని కలుసుకుని ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను విడుదల చేశారు.