Publish Date: Sat, 27 Dec 2014 (07:53 IST)
Updated Date: Sat, 27 Dec 2014 (07:55 IST)
తిరుమలలో అప్పడే కిట కిటలాడుతోంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునే వచ్చిన భక్తులతో తిరుమల జనసంద్రంగా మారుతోంది. శనివారం ఆ రద్దీ మరింత పెరిగింది. వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల సంవత్సరాది ఒకే రోజున రావడంతో తిరుమలకు చేరుకునే భక్తులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు శుక్రవారం ప్రకటించారు.
జనవరి 2వ తేదీన వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రం పరిమిత సంఖ్యలో వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు గదులు దొరకక భక్తులు నానా అగచాట్లు పడుతున్నారు. వేలాది సంఖ్యలో తిరుమలకు చేరుతుండడంతో వాటికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ప్రకటించింది.