Publish Date: Wed, 04 Feb 2015 (15:58 IST)
Updated Date: Wed, 04 Feb 2015 (16:01 IST)
వేంకటేశ్వర భక్తి చానెల్ ను మరింత విస్తృతం చేసేందుకు టిటిడీ సన్నాహాలు చేస్తోంది. ధర్మ ప్రచారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా మొబైల్ ఫోన్లలో కూడా లైవ్ టీవీ ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఈవో సాంబశివరావు అధికారలను ఆదేశించారు. తిరుపతిలో ఆయన ఎస్వీబీసీ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. మరింత నాణ్యమైన ప్రసారాలను చేయాలని ఆదేశించారు. ఎస్వీబీసీని ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ మొబైల్ ఫోన్లోనైనా వీక్షించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో ఆ సాంకేతికతను అనుసరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈవో మదుసుధన రావు, అదనపు ఎఫ్ఏసిఏఓ బాలాజీ, వెంకటశర్త తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.