Publish Date: Thu, 17 Sep 2015 (11:19 IST)
Updated Date: Thu, 17 Sep 2015 (11:23 IST)
వేంకటేశ్వ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారు చిన్నశేషవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఘట్టాన్ని భక్తులు కనులా వీక్షించారు.
గురువారం ఉదయం 9 గంటలకు చిన్న శేషవాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి 11 గంటల వరకూ తిరుమాడ వీధుల్లో భక్త కోటికి దర్శనం ఇచ్చి వారిని కటాక్షించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పడుతూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్శించుకుని తరించారు.
వాహన సేవలో వందలాది మంది కళాకారులు సాంస్కృతికి కార్యక్రమాలు ప్రదర్శించారు.వేదపండితులు, మంగళవాయిద్యాల నడుమ చిన్నశేష వాహనసేవ సాగింది. ఈ కార్యక్రమంలో తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తితిదే బోర్డు సభ్యుడు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.