Publish Date: Fri, 27 Feb 2015 (11:55 IST)
Updated Date: Fri, 27 Feb 2015 (12:00 IST)
తిరుమల శ్రీవారిని సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కే. షణ్ముగం శుక్రవారం తెల్లవారుజామున అభిషేక సేవలో పాలుపంచుకున్నారు. గురువారం రాత్రి తిరుమల కాలినడకన వచ్చిన ఆయన పద్మావతీ అతిథి గృహంలో విడిది చేశారు. అనంతరం తెల్లవారు జామున వైకుంఠ క్యూ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అధికారులు ఆయనకు దగ్గరుండి స్వాగతం పలికారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు దగ్గరుండి దర్శనం చేయించారు. అభిషేక సేవలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద వేదపండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో సాంబశివరావు తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.