సరస్వతి చెట్టు ఉపయోగాలేంటి?
హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్నికూడా ప్రసాదిస్తుందట. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగ
హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్నికూడా ప్రసాదిస్తుందట. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఆ ఆకు యొక్క ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు.ఈ ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది.
మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. మేధా శక్తిని పెంచుతుంది. రకాన్నిశుద్దీకరిస్తుంది.
ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగి శుభం చేకూరుతుంది. ఈ ఆకుతో దైవాన్ని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుందట. అన్ని విఘ్నాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట.