Publish Date: Wed, 11 Mar 2015 (21:30 IST)
Updated Date: Wed, 11 Mar 2015 (21:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో మార్చి 17 నుంచి తాళ్లపాక అన్నమాచార్య 512వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ కార్యక్రమం ఏడు రోజుల పాటు జరుగుతుంది. కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను తిరుపతి సంయుక్త కార్యదర్శి పోలా భాస్కర్ బుధవారం తన కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితంలో అన్నమాచార్యులు 32 వేల సంకీర్తనలు ఆలపించారు. తిరుపతిలో అన్నమాచార్య మండపంలోనూ, తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమాలలో పేరుమోసిన గాయకులు ప్రియా సిస్టర్స్, కుమారి కన్యాకుమారి, డాక్టర్ జి బాలకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణకి చెందిన డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి, మరో డిప్యూటీ ఈవో శారద తదితరులు పాల్గొన్నారు.