Publish Date: Sun, 28 Dec 2014 (08:40 IST)
Updated Date: Sun, 28 Dec 2014 (08:42 IST)
భక్తులతో కిటకిటలాడే శబరిమల అయ్యప్ప ఆలయం నిర్మానుష్యంగా మారింది. అక్కడున్న వారందరూ దిగేశారు. స్వామి దర్శనం కాకపోగా మిగిలిన భక్తులు కింద పంబలో వేచి ఉన్నారు. 30 తేదీ వరకూ ఆలయం తెరుచుకోదు. వివరాలు
శబరిమలలో అత్యంత పవిత్రమైన 'మండలపూజ' శనివారం ముగిసింది. పూజ ముగిసిన అనంతరం దేవాలయాన్ని మూసివేశారు. 'మకరవిలక్కు' (మకర జ్యోతి) కోసం ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు దేవాలయాన్ని తెరుస్తారు.
మండల పూజ సందర్భంగా కేరళ నలుమూలల నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. దేవాలయ అర్చకులు మధ్యాహ్నం మండలపూజ చేశారు. అనంతరం సాయంత్రం దీపారధన చేశారు. తిరిగి ఆలయాన్ని 30 తేదీ సాయంత్రం తెరుస్తారు.