Publish Date: Sat, 21 Feb 2015 (22:14 IST)
Updated Date: Sat, 21 Feb 2015 (22:19 IST)
తిరుమలలో శనివారం సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. శనివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 41,534 మంది దర్శనం చేసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి స్వామి దర్శనం కోసం కనీసం 12 గంటల సమయం పడుతోంది.
ఇక నడక దారిన వచ్చే వారు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 6గంటల దర్శన సమయం పడుతోంది. ఆదివారం కావడంతో ప్రత్యేక దర్శనం టికెట్లు క్లోజ్ అయ్యాయి. శనివారం రాత్రికి మరింత మంది దర్శనం పూర్తయినా ఆదివారం తిరుమలకు చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. తిరుమలలో శనివారం హుండీ ఆదాయం రూ.2.5 కోట్లకు చేరుకుంది.