Publish Date: Mon, 06 Apr 2015 (07:59 IST)
Updated Date: Mon, 06 Apr 2015 (07:32 IST)
తిరుమలలో సోమవారం భక్తులతో తిరుమల రద్దీగానే ఉంది. తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 59,775 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 24 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లు దాటి బయట కూడా క్యూ కట్టారు. వారికి స్వామి దర్శనానికి కనీసం 18 గంటల సమయం పడుతోంది.
ఇక నడకదారిన వచ్చే భక్తులు 7 కంపార్టుమెంట్లలో పూర్తిగా నిండిపోయారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం రద్దీ తగ్గే అవకాశం ఉంది.