Publish Date: Wed, 01 Jul 2015 (12:08 IST)
Updated Date: Wed, 01 Jul 2015 (12:25 IST)
వర్షాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ శ్రీవారి సందర్శన కోసం తిరుపతికి వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు.
తిరుచానూరు అమ్మవారి ఆలయం, కపిలతీర్థం ఆలయాలను సందర్శించారు. మధ్యాహ్నం తిరుమలకు ప్రయాణమవుతారు. తిరుమల సందర్శన కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌కు గవర్నర్ నరసింహన్‌తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు ఘనస్వాగతం పలికారు.