Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో ప్రణయ కలహోత్సవం

Advertiesment
tirumala
తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ ఏటా స్వామి వారికి నిర్వహించే ప్రణయ కలహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. గుడిలో 2వ గంట నివేదన అనంతరం శ్రీమలయప్ప స్వామిని పల్లకిని అధిరోహించి ప్రదర్శనగా  పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.
 
అలాగే శ్రీదేవి, భూదేవిలను వేరు వేరు పల్లకిలపై స్వామివారికి ఎదురుగా తీసుకువస్తారు. వేదపండితుల వేద మంత్రాలు జపిస్తుండగా స్వామివారిపై మూడు సార్లు పూల బంతులు విసిరారు. తాను తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడుతున్నట్లు కనిపించే ఈ సన్నివేశం భక్తులకు కనువిందు చేసింది. ఈ ఉత్సవాన్ని చూసి భక్తులు పుకలరించిపోయారు. ఈ ఉత్సవంలో తితిదే ఈవో సాంబశివరావు తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu