Publish Date: Mon, 23 Feb 2015 (06:46 IST)
Updated Date: Mon, 23 Feb 2015 (06:49 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి కనీసం 50 వేల మందికిపైగా దర్శనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రానికి సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, వారికి 12 గంటల సమయం పడుతోంది. ఇక కాలి బాటన వచ్చేవారు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి రెండుగంటల సమయం పడుతోంది.
శనివారం కనీసం 64 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం కూడా రద్దీ బాగానే ఉంది. అయితే రాత్రి క్రమేణ తగ్గుతూ వచ్చింద. సోమవారం ఉదయానికి సాధారణ రద్దీ కొనసాగుతోంది. ఆదివారం హుండీ ఆదాయం రూ.2.61 కోట్లుగా ఉంది.