Publish Date: Wed, 25 Mar 2015 (10:22 IST)
Updated Date: Wed, 25 Mar 2015 (10:26 IST)
శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా తిరుపతి కోదండరాముడు మంగళవారం బుధవారం సూర్య,చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగారు. వేదపండితులు, కళాబృందాలు వెంటరాగా సీతాసమేత రాముడు మాడ వీధులలో ఊరేగారు. అలంకారభూషితుడైన శ్రీరామ దర్శనంతో భక్తులు పులకించిపోయారు.
ఉత్సవాలలో భాగంగా శ్రీరాముడు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సాయంత్రం చంద్రప్రభవాహనంపై తిరుమాడ వీధులలో విహరించారు. శ్రీరాముడి ఆశీస్సుల కోసం భక్తులు ఎగబడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.