Publish Date: Mon, 17 Nov 2014 (18:20 IST)
Updated Date: Mon, 17 Nov 2014 (18:21 IST)
చీకటి భయాన్ని కలిగిస్తుంది. వెలుగు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. చీకటిని పారద్రోలే వెలుగు దీపకాంతి కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. దీపం వెలిగించడం ఎంతటి శుభప్రదమో, కలలో దీపం కనిపించడం కూడా అంతే మంచిదని చెప్పబడుతోంది.
కలలో దీపం కనిపిస్తే.. కొత్త ఆశలు ఫలిస్తాయనడానికి ... కొత్త జీవితం ఆరంభమవుతుందన డానికి, శుభానికి సంకేతమని పండితులు చెబుతున్నారు. సకల దోషాలు దీపం వెలిగించడంతోనే తొలగిపోతాయి. అలాంటి దీపం కలలో కనిపించడాన్ని శుభపరిణామాలకు సంకేతంగా భావించవచ్చని చెప్పబడుతోంది.