Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Advertiesment
KOIL ALWAR TIRUMANJANAM
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం సాధారణంగా ఉగాది, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే నిర్వహిస్తారు. కేవలం ఈ పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం రోజున మాత్రమే తిరుమంజన కార్యక్రమాన్ని చేపడతారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ మూల విరాట్ కు నీళ్ళు పడకుండా ఒక తొడుగు ద్వారా భద్ర పరిచిన తరువాత గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలను బయటలకు తీసేసిన తరువాత పసుపు , చంనపు పొడి కూరగాయల వేళ్లు, కిచ్చిలి గడ్డ వంటి వాటిని నీళ్ళలో కలిపి ఆలయ గోడలతో సహా మొత్తాన్ని శుద్ధి చేస్తారు. 
 
అనంతరం తిరిగి ఉత్సవ విగ్రహాలను యధాస్థానంలో ఉంచి మూల విరాట్ను  భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డి సాంబశివరావు, జేఈవో శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu