Publish Date: Fri, 26 Dec 2014 (15:09 IST)
Updated Date: Fri, 26 Dec 2014 (15:10 IST)
మనిషి చేసే ప్రతి పనీ సంతోషంతో ముడిపడివుంటుంది. కానీ అందరి సంతోషం ఒకటే విధంగ ఉండబోదు. డబ్బు సంపాదించడం కొందరికి సంతోషాన్నిస్తే.. మరికొందరికి రుచికరమైన ఆహారంతో సంతోషం లభిస్తుంది. తాగడమే మహాసంతోషం, భగవంతుడిని ప్రార్థించడం మరికొందరికి సంతోషాన్నిస్తుంది.
సంతోషం అందరికి ఒకటి కాదు. తమకు బాగా ఇష్టమైన అంశం అందుకోగలగటమే ఆనందం. అందుకోసమే అందరూ కృషిచేస్తారు. ఒక్కొక్కరికి ఒకలాంటి ఆనందం ఎందుకుంటుందంటే వారు పెరిగిన వాతావరణం, వారి కర్మఫలాలను బట్టి ఉంటుంది.
ఆనందం అందించే అంశం ఏమిటో అది ఎలా అందుకోవాలి అనే దాని దగ్గరే అసలు సమస్య ఉంది. ఆనందం అనేది మనసుకు సంబంధించినది. దానికోసం మనిషి చెడు మార్గాలోకి కూడా వెళతాడు. సమస్యలు అక్కడే మొదలవుతాయి.