Publish Date: Fri, 06 Mar 2015 (21:18 IST)
Updated Date: Fri, 06 Mar 2015 (21:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు శుక్రవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కొన్ని తనిఖీలు నిర్వహించారు. కొన్నిమార్పులను అధికారులకు సూచించారు. వివరాలిలా ఉన్నాయి.
నెలకు ఒక్కసారి జరిగే డయల్ యువర్ ఈవో కార్యాక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం భక్తులు చేసిన ఫిర్యాదు మేరకు వెండి వాకిలి వద్దనున్నరద్దీని పరిశీలించారు. అలాగే క్యూలైన్లన్ని తనిఖా చేశారు. అలాగే ఆలయంలోని ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడున్న మందులను పరిశీలించారు. అలాగే కళ్యాణోత్సవ మండపాన్ని తనిఖీ చేశారు.
తరువాత అధికారులతో మాట్లాడి అక్కడ తీసుకోవాల్సిన చర్యలను వారికి చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈవో సి. రమణ, సిఈ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.