Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్ లైన్ లో ద్వాదశి దర్శన టికెట్లు షురూ

Advertiesment
dwadasi
, బుధవారం, 24 డిశెంబరు 2014 (10:47 IST)
వైకుంఠ ఏకాదశి, జనవరి1 పురస్కరించుకుని వైకుంఠద్వారా దర్శనం చేసుకోవాలకుని టికెట్లు దొరకని,వీలుకాక నిరాశ చెందే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ద్వాదశి నాడు ఆ దర్శనభాగ్యాన్ని కలిగిస్తోంది. ద్వాదశి నాడు కూడా వైకుంఠద్వారా తెరచే ఉంటుంది. ఆ రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే వారి కోసం ఆన్ లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశాన్ని కల్గించింది. 
 
ఈ టికెట్ల కొనుగోలు బుధవారం ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ద్వాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వారు ఆన్ లైన్ ద్వారా రూ.300 నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చు. కేవలం 10 వేల టికెట్లు మాత్రమే ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతారు. 
 

Share this Story:

Follow Webdunia telugu