Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవిందా... కొట్టేందుకు కొబ్బరి కాయేది..? తిరుమలలో టెంకాయల కొరత

Advertiesment
tirumala
, శనివారం, 7 ఫిబ్రవరి 2015 (12:09 IST)
తిరుమలలో కొబ్బరి కాయల కొరత తీవ్రంగా ఏర్పడింది. భక్తులు అఖిలాంఢం వద్దకు చేరుకుని హారతి ఇచ్చి తూరుపు తిరిగి ఆంజనేయునికి దండం పెట్టి ఇంటికి చేరకోవాల్సి వస్తోంది. తమ ఇలవేల్పునకు ఒక టెంకాయ కొట్టడానికి కూడా వీలు కాక ఆవేదన చెందుతున్నారు. టెంకాయల కొరత ఎప్పడు తీరుతుందో తెలయని స్థితిని నెలకొని ఉంది. వివరాలిలా ఉన్నాయి. 
 
కలియుగ దైవం శ్రీవేంటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న తరువాత భక్తులు అఖిలాండం ఎదురుగా చేరుకుని అక్కడ టెంకాయ కొడితేనే మొక్కు తీరనట్లు అవుతుంది. హరతీ ఇచ్చి నీ మొక్కు తీర్చాము స్వామి అని చెంపలేసుకుని చెప్పి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ. అయితే తిరుమలలో టెంకాయల కొరత తీవ్రంగా ఏర్పడింది. అక్కడ టీటీడీనే టెంకాయలు విక్రయించే ఓ కౌంటర్ ను ఏర్పాటు చేసింది. రూ. 15లకు ఒక టెంకాయ, ఆకు వక్కా, కర్పూరం, అగరబత్తీలు ఇస్తారు. 
 
టెంకాయలు ఇంకెక్కడా ఎవ్వరూ విక్రయించడానికి వీలు లేదు. దీంతో అక్కడే కొనుగోలు చేయాలి. కానీ శుక్రవారం విక్రయకేంద్రం ఎదుట స్టాకు లేవు అనే బోర్డు దర్శనం ఇచ్చింది. దీంతో భక్తులు ఊసురోమంటున్నారు. టెంకాయ కొడితేనే తమ యాత్ర పూర్తయ్యిందని భావిస్తారు. టెంకాయలు లేకపోవడంతో భక్తులు కేవలం భక్తులు కర్పురం వెలిగించి తిరుగు ప్రయాణం అవుతున్నారు. తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu