Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యకు గౌరవం ఇవ్వట్లేదా? భార్యను ఇంట్లో యంత్రం అనుకుంటున్నారా?

భార్యను భర్త అనేవాడు గౌరవించాలని పురాణాలు చెప్తున్నాయి. అమ్మకు, భార్యకు జీవితంలో ఉన్నత స్థానమివ్వాలి. నాన్న పుట్టుకకు కారణమైతే.. అన్నదమ్ములు, సోదరీమణులు.. ఓ చెట్టు ఫలాలు వంటి వారు. కానీ భార్య మాత్రం ఎ

Advertiesment
Respect
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (14:17 IST)
భార్యను భర్త అనేవాడు గౌరవించాలని పురాణాలు చెప్తున్నాయి. అమ్మకు, భార్యకు జీవితంలో ఉన్నత స్థానమివ్వాలి. నాన్న పుట్టుకకు కారణమైతే.. అన్నదమ్ములు, సోదరీమణులు.. ఓ చెట్టు ఫలాలు వంటి వారు. కానీ భార్య మాత్రం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి ద్వారా ఒక్కటయ్యే మహిళను గౌరవించాలి. వంశం, ఇంటి పేరు, తల్లిదండ్రులు, తోబుట్టువులు అన్నింటిని వదిలి తాళికట్టిన తర్వాత.. చిటికెన వేలు పట్టుకుని భర్త వెంట వచ్చేసిన భార్యను నిర్లక్ష్యం చేయకూడదు. భార్యను గౌరవించని వ్యక్తి సమాజంలో ఎవరిని గౌరవిస్తాడు. 
 
భార్యను నవ్వించని, ఆమెను సుఖపెట్టని వ్యక్తి పరలోకంలో పాపుడైపోతాడట. భార్య పేరుతో, భర్త వెంట వచ్చే మహిళ.. అతని వంశం కోసం ఇబ్బంది పడి.. తండ్రి అనే హోదా ఇస్తుంది. అంతేగాకుండా కన్నబిడ్డకే తండ్రిని పరిచయం చేస్తుంది. భర్త కోసం తపిస్తుంది. అలాంటి వ్యక్తిని సంతోషపెట్టకపోవడం, ఈసడింపులకు గురిచేస్తే.. అతను పురుషుడని ఏమాత్రం చెప్పలేరు. 
 
భార్యను ఇంట్లో యంత్రం అనుకుంటే.. ఆమెను శాసిస్తూ పబ్బం గడుపుకునే వ్యక్తిని పురుషుడని ఎలా అంటారు. భర్త కోసం త్యాగశీలిగా మారి.. సర్వాన్ని త్యజిస్తుంది. అలాంటి భార్యను ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం, విమర్శించడం వంటివి చేస్తే.. ఏమాత్రం పుణ్యఫలం లభించదు. ఈ తప్పును దిద్దుకోవాలి.. లేకుంటే సర్దుకోవాలి. 
 
జీవితాంతం వెంట నడిచే భార్య మంగళసూత్రం కట్టాక చావోరేవో అన్నీ భర్తే అనుకుని వెంట వచ్చేస్తుంది. స్త్రీ పురుషులంటే పవిత్రమైన కలయిక. అలాంటి స్త్రీని పురుషుడు పరమ ప్రేమతో గౌరవించాలి. భార్య పుణ్యకారకులు. భార్య ఉంటేనే భర్త అనేవాడు యాగం, యజ్ఞం చేయగలడు. అంతేగాకుండా కన్నబిడ్డకు పెళ్లి కూడా చేయగలడు. అదే భార్య లేకుంటే.. ఇలాంటి ఉత్తమ కార్యాలు చేసేందుకు అతడు అనర్హుడు. 
 
అందుకే భార్య ఉంటేనే ఈ లోకంలో సుఖమన్నది లభిస్తుందని, ఆమెను గౌరవించాలని విదురుడు ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తాడు. కంటికి గంతలు కట్టి.. భార్య చూడలేని ఈ లోకాన్ని తానూ ఇకపై చూడబోనని గాంధారి నిర్ణయించడంతో.. ఆమెను నిర్లక్ష్యం చేసిన ధృతరాష్ట్రునికి విదురుడు ఈ నీతిని బోధించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? విభూతి ప్రసాదాన్ని కింద పారేస్తే?