Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? విభూతి ప్రసాదాన్ని కింద పారేస్తే?

పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? నిమ్మరసం, పీతాంబరి పౌడర్, విభూతి ద్వారా పూజ సామాన్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే.. పూజ సామాన్లు బంగారు వర్ణంలో మెరిసిపోతాయి. పూజ గదిలో ఓ టిష్యూ పౌడర్‌తో పాటు

Advertiesment
clean
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (13:38 IST)
పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? నిమ్మరసం, పీతాంబరి పౌడర్, విభూతి ద్వారా పూజ సామాన్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే.. పూజ సామాన్లు బంగారు వర్ణంలో మెరిసిపోతాయి. పూజ గదిలో ఓ టిష్యూ పౌడర్‌తో పాటు అగరవత్తుల వేస్టుల్ని తొలగించేందుకు ఓ డబ్బాను ఉంచాలి. వారానికి ఓసారి గురువారం సాయంత్రం పూట పూజ సామాన్లను శుభ్రం చేయాలి. పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. 
 
పూజ సామాన్లను ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే త్వరలోనే నల్లబడిపోతాయి. కాబట్టి సామాన్లను కడిగేశాక చివర్లో మంచినీటిలో ముంచెత్తాలి. టూత్ బ్రష్, స్క్రబ్బర్లు పూజ సామాన్ల కోసం సపరేటుగా ఉంచుకోవాలి. టిష్యూతో దీపాల్లో ఉండే నూనెను ముందుగా శుభ్రం చేసుకోవాలి. ఆపై పూజ సామాన్లను ముందుగా డిష్ వాష్ బార్‌తో కడిగేయాలి. 
 
తర్వాత నిమ్మరసాన్ని పూజ సామాన్లకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఒక్కో సామానును పీతాంబరి పౌడర్‌తో స్క్రబర్‌తో తోముకోవాలి.  నల్లటి మరకలను పోగొట్టుకోవాలంటే టూత్ బ్రష్‌ను ఉపయోగించి.. బాగా రుద్దుకోవాలి. ఇలా ఒక్కో పాత్రను శుభ్రం చేసుకోవాలి. ఆపై విభూతితో శుభ్రం చేసిన పూజ సామాన్లను రుద్దుకోవాలి. ఆపై పొడిబట్టతో తుడిచేయాలి. 
 
ఆపై పూజ సామాన్లు కాసేపు ఆరిన తర్వాత చందనం, పసుపును కలిపి బొట్టు పెట్టుకోవాలి. దానిపై కుంకుమ దిద్దాలి. ఆలయాల్లో ఇచ్చే కుంకుమ విభూతి ప్రసాదాలను కింద పారేయకుండా.. తులసీ చెట్లలో వేసేయాలని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా పవిత్రంగా భావించే ప్రసాదాలు మన కాలికి తగలవు. తద్వారా కొన్ని దోషాలు అంటవని వారు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రెండూ మనిషిని అంధుడిని చేస్తాయి... షిర్డి సాయి