Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ ఆరంభం

Advertiesment
sabarimalai
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. శబరిమలలో నవంబరు 16వ తేది మండల పూజ ప్రారంభమవుతుంది. స్వామి దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం ఉన్న విషయం తెలిసింది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు భక్తులు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చును.
 
ఆ వెబ్‌సైట్‌లో భక్తులు తమ పేరు, చిరునామా, ఫోటోను జత చేసి వర్చువల్ క్వ్యూ కార్డును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని సూచించిన టైం కంటే అర గంట ముందుగా  పంబకు వెళ్లినట్లైతే అక్కడ ఉన్న ప్రత్యేక కేంద్రంలో అధికారులు పరిశీలించి కొండపైకి ఎక్కేందుకు అనుమతిస్తారు.
 
ఈ విధానం ద్వారా ఒక గంట సేపటిలో ఆలయానికి చేరుకుని 18 మెట్లు ఎక్కి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చును. ఈ సేవ నవంబర్ 16వ తేది నుంచి డిసెంబర్ 27వ తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం 2015 జనవరి నెలల జరిగే మకర దీప పూజ వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu