గోదావరి మహాపుష్కరాల సందర్భంగా తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున జనం పుష్కర స్నానాలు ఆచరించారు. లక్షలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి గోదావరి నదీ తీరాల్లోని పుష్కరఘాట్లకు తరలివెళ్లారు. కుటుంబాలకు కుటుంబాలు వెళ్ళి నదిలో స్నానమాచరించారు. తొలి రోజే రెండు రాష్ట్రాల్లో సుమారు 24 లక్షల మందికిపైగా భక్తులు పుష్కరస్నానాలు చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 15 లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో సుమారు 5 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.మొదటి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పుష్కరాలకు హాజరైన భక్తులు సుమారుగా..
ఆంధ్రప్రదేశ్
తూర్పుగోదావరి జిల్లా- 10 లక్షలు
పశ్చిమగోదావరి జిల్లా- 5 లక్షలు
తెలంగాణ
నిజామాబాద్ జిల్లా- 1.20 లక్షలు
ఆదిలాబాద్ జిల్లా - 1.25 లక్షలు
కరీంనగర్ జిల్లా - 5 లక్షలు
వరంగల్ జిల్లా - 40 వేలు
ఖమ్మం జిల్లా - 1.30 లక్షలు