Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏకాదశి, ద్వాదశిలలో1.63 లక్షల మందికి దర్శన భాగ్యం : ఈవో

Advertiesment
ttd
, శనివారం, 3 జనవరి 2015 (22:13 IST)
వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలను పురస్కరించుకుని కనీసం 1,63,080 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగించగలిగామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబ శివ రావు తెలిపారు. ఏకాదశి నాడు 78,003 మంది ద్వాదశి సందర్భంగా 85077 మంది దర్శనం చేసుకోగలిగారని వివరించారు. తిరుమలలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పర్వదినాలను దృష్టిలో పెట్టుకుని 3,08,186 లడ్డూలను అదనంగా తయారు చేయించామని చెప్పారు. ఈ రెండు రోజుల్లో కనీసం 5.98 లక్షల లడ్డూలను భక్తులు తీసుకున్నారని చెప్పారు. 
 
మొదటి రోజున 3.08 లక్షలు, రెండో రోజున 2.95 లక్షల లడ్డూలను తీసుకున్నారని చెప్పారు.  మొదటి రోజున రూ. 3.22 కోట్లు, రెండో రోజున రూ. 2.81 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు చాలా చక్కగా పని చేశారని చెప్పారు. జేఈవో  శ్రీనివాస రాజు, ఆయన జట్టు సమర్ధవంతంగా పని చేసిందని అభినందించారు. 

Share this Story:

Follow Webdunia telugu