Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

Advertiesment
Baba Ramdev run with horse

సిహెచ్

, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (23:01 IST)
ఈరోజుల్లో 30 ఏళ్లకే బానపొట్టతో కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానే వుంటోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గి తిండి పైన యావ పెరిగి పనిచేస్తూ కూడా కుర్చీలో కూర్చుని బిస్కట్లు, ఇతర చిరుతిండ్లను కరకరలాడిస్తూ నోటికి పనిచెపుతుంటారు. ఫలితంగా శరీరం వుండాల్సిన బరువు కంటే అధిక బరువును సంతరించుకుని అడుగు తీసి అడుగు వేయడానికి ఆయాసపడుతుంటారు. కానీ చక్కని జీవనశైలితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే రేసుగుర్రంలా యోగా గురు బాబా రాందేవ్ మాదిరిగా వుండొచ్చు.
 
యోగా ఎందుకు చేయాలి?
ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. పని ఒత్తిడితో పాటు ఆర్థికపరమైన సమస్యలు తదితర ఇతర సమస్యల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే దైనందిన జీవితంలో ప్రతిరోజూ కనీసం ఓ అర్థగంటయినా యోగా చేయాలంటున్నారు నిపుణులు. యోగాతో కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయని చెపుతున్నారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.
 
యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. బలాన్ని పెంపొందించుకోవడానికి యోగా సహాయపడుతుంది. యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. యోగా కీళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. యోగా అనేది ఒక శక్తివంతమైన మైండ్‌ఫుల్‌నెస్ సాధన. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా వుండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు