Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైట్ కాలర్ ఉద్యోగమా...? మానసిక పటుత్వానికి భుజంగాసనం వేయండి

వైట్ కాలర్ ఉద్యోగమా...? మానసిక పటుత్వానికి భుజంగాసనం వేయండి
, శనివారం, 15 ఫిబ్రవరి 2014 (16:20 IST)
FILE
సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని ఆసన అంటే వ్యాయామం అని అర్థం. భుజంగాసనం చాలా సులువైన వ్యాయామ రీతిగా చెప్పవచ్చు. ఈ ఆసనం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడానికిగాను దీని గురించిన వివరాల పట్ల శ్రద్ధ వహించాలి.

విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నిస్తే మంచిది. ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెన్నెముక కండరాలు ఒత్తిడికి గురికారాదు. అలాగే ఆసనాన్ని త్వరత్వరగాను, ఉన్నట్లుండి కూడా వేయడానికి ప్రయత్నించరాదు. భుజంగాసనాన్ని శలభాసనం, ధనురాసనాలతో కలిపి వేయాలి, ఈ మూడు ఆసనాలు కలిపి త్రయంగా ఏర్పడతాయి.

ఈ మూడు ఆసనాలూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలు హలాసనంగా, పశ్చిమోత్తాసనంగా రూపు దాలుస్తాయి. భుజంగాసనం రెండు విధాలుగా ఉంటుంది: సాధారణం, సంక్లిష్టం.

భుజంగాసనం వేయు విధానం :
మకరాసనంలో విశ్రాంతిగా ఉండండి.
కాలిమడమల బొటనవేళ్లను కలిపి ఉంచి బోర్లా పడుకోవాలి.
చుబుకాన్ని నేలకు ఆనించాలి.
అరికాళ్లు పై వైపుకు తిరిగి ఉండాలి.
మోచేతులను వంచి అరచేతులను ఆఖరి పక్కటెముక ప్రక్కగా ఉంచండి.
మోచేతులను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలాన్ని ఉంచొద్దు.
ముందుగా తలను పైకెత్తుతూ త్రాచుపాము పడగెత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తండి.
నాభి స్థానము నేలకు అంటీ అంటనట్లుగా ఉంచండి.
తిరిగి మెల్లగా మకరాసనంలోకి రండి.

ప్రయోజనాలు :
రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం ప్రత్యేకించి లబ్ది చేకూరుస్తుంది.
అండాశయం మరియు మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది.
గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది. పొత్తికడుపు భాగంలో ఒత్తిడిని పెంచడం ద్వారా ఇది జరుగుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
స్వల్ప రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే భుజంగాసనాన్ని తప్పక వేయండి.
పెద్దప్రేగు మరియు పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది. మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.
వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి భుజంగాసనం మంచి వ్యాయామం.
ఐటి ఉద్యోగులు క్రమం తప్పకుండా భుజంగాసనం వేయాలి. వీరి శారీరక, మానసిక పటుత్వానికి ఇది సరైన వ్యాయామం.

Share this Story:

Follow Webdunia telugu