Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారం అధికంగా తింటున్నారా.. అయితే త్వరగా ముసలివారైపోతారు?

మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల మన శరీరం తొందరగా ముసలితనానికి చేరుకుంటుంది. ఆహారపదార్థాలు మనం ఎంత మేలు చేస్తాయో, అంతే కీడు కూడా చేస్తాయని అంటున్నారు. ఏదైనా మితంగా తింటే ఔషధం, విపరీతంగా తింటే విషం అనే

Advertiesment
కారం అధికంగా తింటున్నారా.. అయితే త్వరగా ముసలివారైపోతారు?
, మంగళవారం, 12 జులై 2016 (13:33 IST)
మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల మన శరీరం తొందరగా ముసలితనానికి చేరుకుంటుంది. ఆహారపదార్థాలు మనం ఎంత మేలు చేస్తాయో, అంతే కీడు కూడా చేస్తాయని అంటున్నారు. ఏదైనా మితంగా తింటే ఔషధం, విపరీతంగా తింటే విషం అనే నానుడి మనకు తెలిసిన విషయమే. కొన్ని ఆహారాలు మనకు ఎలాంటి సాయం చేయకపోగా హాని కలిగిస్తాయి. తొందరగా వృద్దాప్యంలోకి నెట్టేస్తాయి. అలాంటివేంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
ఆల్కహాల్‌‌కి దూరంగా ఉంటే అటు ఆరోగ్యంగా ఉంటారు. కాలేయం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన చర్మం అంత అందంగా ఉంటుంది. కాలేయం బాగా పనిచేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళి మీ చర్మం ఎంతో కాంతి వంతంగా మెరుస్తుంది.
 
స్వీట్లు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ స్వీట్లు వృద్దాప్యంలోకి నెట్టేయడంలో ముందుంటాయట. వీటివల్ల శరీరంలో గ్లెకేషన్‌ అనే ప్రక్రియ మొదలై శరీరంలోని కణాలు ప్రోటీన్లను గ్రహించడం మానేస్తాయట. ఆ కారణం వల్ల కణాలు రోజురోజుకి బలహీనపడి తొందరగా వృద్దాప్యం రావడానికి  తోడ్పడుతుంది. 
 
కాఫీ ఎక్కువగా తాగ కూడదు. ఎందుకంటే చర్మం తేమను కోల్పోతుంది. దానివల్ల చర్మం పొడి బారిపోయి తొందరగా ముడతలు పడటానికి సహాయపడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్‌ను మితంగా కాకుండా ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఫైబర్‌ స్థాయి పూర్తిగా పడిపోతుంది.
 
కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల రక్త కణాలు డైల్యూట్‌ అయిపోయి చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తాయి. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల తొందరగా ముడతలు రావడానికి దోహదపడతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపుతో చుండ్రుకు చెక్ పెట్టొచ్చా? ఇదిగోండి హెయిర్ ప్యాక్!