బరువును తగ్గించే డ్రింక్స్.. ట్రై చేయండి..
బరువు తగ్గాలా? అయితే ఈ డ్రింక్స్ రోజూ తీసుకోండి. రాత్రిపూట ఒకప్పు గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనెని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని గంట పాటు అలానే ఉంచి.. సగం క
బరువు తగ్గాలా? అయితే ఈ డ్రింక్స్ రోజూ తీసుకోండి. రాత్రిపూట ఒకప్పు గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనెని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని గంట పాటు అలానే ఉంచి.. సగం కప్పును రాత్రి పూట భోజనం చేసిన ముప్పావుగంట తర్వాత తాగాలి. ఉదయం పూట పరగడుపున మిగిలిన అరకప్పు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గిపోతుంది.
అలాగే
ఒక కప్పు గోరు వెచ్చని నీరు,
ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
ఒక టేబుల్ స్పూన్ తేనె,
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని ఓ పాత్రలో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రోజుకోసారి తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక బరువు సమస్య దూరమవుతుంది.