Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నం వద్దు.. బరువు పెరిగిపోతారు... దంపుడు బియ్యంతో వండిన అన్నం తినండి..

తెల్లటి అన్నం వద్దు.. దంపుడు బియ్యంతో వండిన అన్నం తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తెల్లటి బియ్యంలో పీచు పదార్థాలు లేనందున.. తీసుకున్న ఆహారంలోని శక్తి.. రక్తంలోకి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తినంతటిని కొవ

Advertiesment
Brown rice
, శుక్రవారం, 26 మే 2017 (09:19 IST)
తెల్లటి అన్నం వద్దు.. దంపుడు బియ్యంతో వండిన అన్నం తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తెల్లటి బియ్యంలో పీచు పదార్థాలు లేనందున.. తీసుకున్న ఆహారంలోని శక్తి.. రక్తంలోకి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తినంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. తద్వారా తెల్లటి అన్నాన్ని తీసుకునేవారు బరువు పెరిగిపోతారు. 
 
తెల్లని బియ్యం శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని సమకూర్చలేదు. ఆహారం తీసుకున్న మూడు, నాలుగు గంటల్లోనే నీరసం వచ్చేట్లు చేస్తుంది. తెల్లటి బియ్యంలో వండిన అన్నంలో తేలిగ్గా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలుండవు. తౌడులోకి ఈ కొవ్వు పదార్థాలు వెళ్లిపోతాయి. అయితే దంపుడు బియ్యంతో చేసిన అన్నాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ముడి బియ్యంతో చేసిన అన్నం అరగదనేది అపోహ మాత్రమే. 
 
గోధుమలు, రాగులను, జొన్నలను కూడా అన్నంగా వండుకునైనా తినవచ్చు. అన్నం బదులుగా రొట్టెలు లేదా మూడు, నాలుగు రకాల గింజలను కలిపి ఆడించి ఆ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. బలాన్నందించే ముడిబియ్యాన్నే తీసుకంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా.. బరువును కూడా తగ్గించుకోవచ్చు.
 
దంపుడు బియ్యం‌లో పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఈ బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాస్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. 
 
బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తుంది. శరీర బరువును సాధారణంగా ఉంచుతుంది. బ్రౌన్ రైస్‌లో పీచు సమృద్ధిగా ఉన్నందున మీరు అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమేకాక ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువగా తినే అవకాశాలను తగ్గిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెంగీ వ్యాధిని అమాంతం నిరోధించిన కివీ పండు పళ్లలో రారాజు