Publish Date: Tue, 20 Jan 2026 (20:56 IST)
Updated Date: Tue, 20 Jan 2026 (20:59 IST)
కాలేయం ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయాన్ని కాపాడేందుకు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము.
సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తింటే లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది.
ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది, కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
రాత్రి పూట త్వరగా పడుకొని, ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు.
ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి.
ఉదయం అల్పాహారం చేయడం అసలు మానేయకూడదు. మానేస్తే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది.
అతిగా ఆహారం తీసుకుంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి లివర్‌కు ఎక్కువ సమయం పట్టడమే కాకుండా అదనపు భారం పడుతుంది.