Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలసటగా వుందా... ఐతే ఇవి చేసి తీరాల్సిందే... (video)

అలసటగా వుందా... ఐతే ఇవి చేసి తీరాల్సిందే... (video)
, బుధవారం, 11 సెప్టెంబరు 2019 (22:42 IST)
తలనొప్పి, కడుపులో వికారంగావుండటం, కండరాల నొప్పులు, మూడీగా ఉండటం, ఆకలి మందగించటం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం వంటివి అలసిపోతున్నట్లు తెలిపే చిహ్నాలు. దీన్ని అధికమించాలంటే కొన్ని పాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
1. కంప్యూటర్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కాబట్టి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయటం, టీవీ చూడటం వంటివి కాస్త తగ్గించండి. 
 
2.  దీర్ఘ కాలికంగా డిప్రెషన్, యాంగ్జైటీ కలిగిస్తున్న కారణాలు మీ జీవితంలో ఏమున్నాయో గుర్తించండి. ఆ తర్వాత వాటితో రాజీపడటమో లేక కౌన్సిలింగ్ సహాయం తీసుకోవడమో చేయండి. 
 
3. జీవితాన్ని హాయిగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. రోజూ కనీసం 10 నిముషాలైనా నడవండి. శరీరానికి సరైన ఆహారం, వ్యాయామం, మనసుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం, నిస్సత్తువ మీ దరికి చేరదంటున్నారు వైద్యులు. 
 
4. శరీరంలో నీరు లేకపోయినా నిస్సత్తువ ఆవహిస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగండి. 
 
5. కార్బోహైడ్రేట్లు ఎక్కువగావున్న ఆహారం, తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అతిగా డైటింగ్ చేయడం వల్ల కూడా శరీరంలోని శక్తి హరించుకుపోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది. 
 
6. ఒకేసారి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. మహిళలు తీసుకునే ఆహారంలో ఐరన్ మోతాదు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. 
 
7. నిద్ర లోపాలను సవరించుకుని తగినంతగా నిద్ర పోవడానికి ప్రయత్నించండి. నిద్ర పట్టడానికి వాడే మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. 
 
8. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటే మంచిది. భౌతిక వ్యాయామం తగినంతగా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సినంత నిద్ర లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదీనా ఆకులు ముద్దగా నూరి అలా చేస్తే...