Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ 5 పదార్థాలు తీసుకుంటే ఒత్తిడి మాయం...

ఈ 5 పదార్థాలు తీసుకుంటే ఒత్తిడి మాయం...
, గురువారం, 7 ఫిబ్రవరి 2019 (20:52 IST)
ప్రస్తుత కాలంలో మానవుని జీవితం ఉరుకుల పరుగులమయంగా మారింది. అందువల్ల చాలామంది మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా అవసరం. అయితే ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్దాలను మన ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. కమలాపండు.... ఇది విటమిన్ 'సి'ని పుష్కలంగా కలిగి ఉంది. కమలాపండు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దాంతోపాటు కార్టిసోల్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పూట ఒక్క పండు తినటం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
2. బాదం... ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడి, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. 
 
3. నేరేడుపళ్లు.... వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, పైటో న్యూట్రియంట్లూ ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. 
 
4. పాలు... వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, బి2, బి12 విటమిన్లు, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. పాలలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక ప్రతి రోజూ గ్లాసుడు పాలు తప్పనిసరిగా త్రాగటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
 
5. చేపలు... వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి వారంలో రెండుసార్లు చేపలను తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది...?