భోజనం చేశాక పండ్లు ఎందుకు ఆరగించాలి.. ఎలాంటి పండ్లు తినాలి?
చాలా మంది భోజనంతో సరిపెట్టేస్తుంటారు. మరికొందరైతే ఇంట్లో అందుబాటులో ఉన్న పండును ఆరగిస్తుంటారు. నిజానికి భోజనం తర్వాత విధిగా పండు ఆరగించడం ఎంతో మంచిది.
చాలా మంది భోజనంతో సరిపెట్టేస్తుంటారు. మరికొందరైతే ఇంట్లో అందుబాటులో ఉన్న పండును ఆరగిస్తుంటారు. నిజానికి భోజనం తర్వాత విధిగా పండు ఆరగించడం ఎంతో మంచిది. ఉదయం అల్పాహారమైనా, మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ అయినా భోజనం చేశాక ఈ పండ్లను ఆరగించాలి.
భోజనం చేశాక పండ్లను ఆరగించడానికి ఓ కారణం ఉంది. అన్నం తిన్న కొద్దిసేపటికీ చాలామందికి గ్యాస్ సమస్య వస్తుంటుంది. తిన్నది సరిగ్గా అరగకపోవడమో, ఎక్కువగా తినడమో, ఇతర జీర్ణ సంబంధ సమస్యల వల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అదే ఆహారం సరిగ్గా జీర్ణమైతే అలా గ్యాస్ రాదు. ఈ క్రమంలో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై తర్వాత గ్యాస్ రాకుండా ఉండాలంటే పలు పండ్లను తింటే చాలు. దీంతో ఇతర జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి.
భోజనం చేశాక తినాల్సిన పండ్లలో అరటిపండు, ఆపిల్, పైనాపిల్, బొప్పాయి వంటివి ఆరగించడం ఉత్తమం. ఎందుకంటే వీటిలో అధిక ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని ఆరగించడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఆరగించిన ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. బొప్పాయి పండు అజీర్తి సమస్యను నివారిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థ శుభ్ర పడుతుంది.