Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొగరుబోతు అమ్మాయిలంటే అబ్బాయిలు ఆమడ దూరం పారిపోతారట..!

సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల అందానికి మాత్రమే పడిపోతారనుకుంటే పొరపాటే. అమ్మాయిలో ఉండే మరెన్నో విషయాలు కూడా అబ్బాయిలను ఇట్టే ఆకర్షిస్తాయి. ముఖం మాత్రమే కాకుండా ఇతర విషయాలకి కూడా అబ్బాయిలు అమ్మాయిలకి ఫి

Advertiesment
Real facts
, మంగళవారం, 5 జులై 2016 (10:02 IST)
సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల అందానికి మాత్రమే పడిపోతారనుకుంటే పొరపాటే. అమ్మాయిలో ఉండే మరెన్నో విషయాలు కూడా అబ్బాయిలను ఇట్టే ఆకర్షిస్తాయి. ముఖం మాత్రమే కాకుండా ఇతర విషయాలకి కూడా అబ్బాయిలు అమ్మాయిలకి ఫిదా అయిపోతారు. అవేంటో చూద్దాం.
 
అమ్మాయిలు అబ్బాయిలని చూసి ఓ చిరునవ్వు చిందిస్తే చాలట. అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే ఎటువంటి మగాడైనా ఇట్టే ఆమెకు లొంగిపోతాడట.
 
అమ్మాయి ముద్దుగా తనకి పేరుపెట్టి పిలిచినప్పుడు అబ్బాయిల ఆనందానికి అవధులుండవట. చాలామంది అమ్మాయిలకు తెలియని విషయం ఏమింటే, మగవారు సిగ్గుపడే అతి అరుదైన సందర్భం కూడా ఇదే.
 
ప్రేమను తెలియజేయగానే పడిపోయే అమ్మాయిలంటే అబ్బాయిలకు అంత మజా ఉండదట. అలాగని కోపం కొద్ది దూరం పెట్టే అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడరు, చిలిపిగా, చిన్నగా ఊరిస్తూ ఆశలు రేకెత్తించే అమ్మాయి అంటే అబ్బాయిలు పడిచస్తారట.
 
నవ్వుతూ, చక్కగా మాట్లాడే అమ్మాయిలకి గౌరవంతో పాటు ప్రేమను అందిస్తారు అబ్బాయిలు. పొగరుబోతు అమ్మాయిల వెంటపడటం చాలా అరుదు. అలాంటి అమ్మాయిల దరిదాపుల్లోకి కూడా అబ్బాయిలు వెళ్లరట.
 
తన గురించి పరితపించే అమ్మాయిలను అబ్బాయిలు ఎప్పటికీ వదులుకోరట. తనను నమ్మి, సపోర్ట్ ఇచ్చే అమ్మాయిలను మనసున్న మగవాడైతే జీవితాంతం వదులుకోలేడట. అందం అనే విషయం అస్సలు పట్టించుకోడట. తనకోసమే సర్వస్వం వదులుకునే అమ్మాయిలను అబ్బాయిలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. సో అందం చూసి అబ్బాయిలు పడరు సుమా...! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు తగ్గాలా? వంటకు ఆలివ్ ఆయిలే ముద్దు.. సోడా, చిప్స్ వద్దు!