Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చింత చిగురు యాంటీఆక్సిండెట్‌గా ప‌ని చేస్తుంది...

చింత చిగురు యాంటీఆక్సిండెట్‌గా ప‌ని చేస్తుంది...
, శనివారం, 7 మే 2016 (17:26 IST)
చింత చిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. చింతచిగురులో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పని చేసి, మ‌న శ‌రీరంలోని వ్యర్థాలను బ‌య‌ట‌కు తొలగిస్తుంది. అన్ని వయసుల వారూ దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వ‌వ‌చ్చు.
 
• చింత చిగురుతో కూరా, పచ్చడీ ఇతరత్రా వాటితో కలిపి పదార్థాల్ని చేసుకోవచ్చు. తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. వీటిలోని ఆమ్లాలు రక్తంలోని మలినాలను తక్షణమే తొలగిస్తాయి.
 
• చిన్నారుల కడుపులో నులిపురుగులు ఉంటే ఎంతగానో బాధిస్తాయి. అలాంటి వారికి తరచూ చింత చిగురుతో చేసిన కూరలూ, పచ్చళ్లూ తినిపిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలానే కళ్లు దురదలుగా అనిపించినా ఈ చిగురు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
• చింతపండులో కంటే చిగురులో విటమిన్ 'సి' శాతం అధికంగా ఉంటుంది. చింత చిగురులోని యాంటీఆక్సిండెట్లు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తాయి.చింత చిగురు ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొదుపు చేయడంలో భర్త కంటే భార్యే టాప్.. తెలుసుకోండి..!