Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొదుపు చేయడంలో భర్త కంటే భార్యే టాప్.. తెలుసుకోండి..!

పొదుపు చేయడంలో భర్త కంటే భార్యే టాప్.. తెలుసుకోండి..!
, శనివారం, 7 మే 2016 (12:36 IST)
ఒకప్పుడు కుటుంబ పోషణ, నిర్వహణ అంటే పురుషులదే అనే భావన ఉండేది. కానీ, మారిన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఇందులో పాలుపంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని ఆర్థిక విషయాల్లోనూ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉండాలి. వారికి పూర్తి సమాచారం తెలియాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సాగే సంసారంలో ఆర్థిక విషయాల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. 
 
ఎవరో ఒకరే డబ్బు నిర్వహణను చూస్తుంటారు. మరొకరు కేవలం విని వూరుకుంటారు. చాలామంది మగవాళ్లు డబ్బు విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తారు. ఇలాంటివారే ఎక్కువగా డబ్బు లావాదేవీలు నిర్వహిస్తుంటారు. కొంతమంది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఇంకొందరు ఆచితూచి రూపాయి రూపాయికీ లెక్కలేస్తుంటారు. 
 
కాని మనీ మేనేజ్‌మెంట్‌.. కుటుంబ ఆర్థిక విషయాలను నెత్తినేసుకోవడంలో భర్తల కంటే భార్యలే ముందుంటారట. కుటుంబ ఆర్థిక విషయాల్ని.. అవసరాలను గుర్తించి, డబ్బును పొదుపుగా వాడటంలో భార్యకు మించిన వారు లేరని పరిశీలనలో తేలింది. భారత్‌లో భర్త మాటకు విలువ ఇచ్చే సంస్కృతి ఇంకా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. 
 
చాలా కుటుంబాల్లో డబ్బు విషయాల్లో మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటారట. అందుకే బ్యాంకు లావాదేవీల ఖాతాలు, బీరువా తాళాలు ఎక్కువగా మహిళల పేరుమీదే ఉంటాయని పరిశీలకులు చెప్తున్నారు. భర్త డబ్బును సంపాదించగలరే కానీ, వాటిని తొందరగా ఖర్చు పెట్టే గుణం వారికి ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెగ్యులర్ డైట్‌లో సహజసిద్ధమైన పండ్లు బెస్ట్ ఫుడ్స్