చాలామంది వెలగపండును తినేందుకు ఇష్టపడరు. జీర్ణశక్తిని సరిచేసేందుకు వెలగపండుని మించిన ఔషధం లేదట. రక్తంతో కూడిన విరేచనాలు, జిగురుతో కూడిన విరేచనాలు భోజనం చెయ్యగానే విరేచనానికి వెళ్ళాలనిపించడం.. నీరసం, కడుపులో మంట, మలబద్థకం, ప్రేగుపూత ఇవన్నీ అమీబియాసిస్ వ్యాధి లక్షణాలట. వీటన్నింటి నుంచి విముక్తి కలిగిస్తుందట వెలగపండు.
వాంతి.. వికారం ఉన్నప్పుడు వెలగపండుని తింటే సరిపోతుందట. అలాగే జలుబు, దగ్గు, తుమ్మలు, ఆయాసం, దురదలకు, దద్దుర్లు, కడుపునొప్పికి సమాధానం ఒక్క వెలగపండునే తినడం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఏ రకమైన ఎలర్జీ ఉన్నా సరే వెలగపండును ఆహారంగా తీసుకుంటే వైద్య ప్రయోజనం పొందినట్లేనట. వెలగపండులోని గుజ్జును మాత్రమే బెల్లంచేర్చి కాస్త ఉప్పు కారం కూడా కలుపుకుని తినాలట. ఇది ఎంతో మంచిదట.
గుండె జబ్బులు, గొంతు వ్యాధులున్న వాళ్ళు వెలగపండు తినకూడదట. అతిగా తింటే వెలగపండు అజీర్తి కడుపులో నొప్పిని కలుగజేస్తాయట. పరిమితంగా తింటే ఔషదంగా ఉపకరిస్తుందట.