Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొన్ని నిమిషాల్లోనే ఒత్తిడి తగ్గాలంటే...

ఒత్తిడి లేదా టెన్షన్.. ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఈ ఒత్తిడి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. ఏదేని సందర్భంలో తీవ్రమైన ఒత్తిడికి లోనైపుడు కొన్ని క్షణాలు లేదా నిమిషా

కొన్ని నిమిషాల్లోనే ఒత్తిడి తగ్గాలంటే...
, శనివారం, 1 సెప్టెంబరు 2018 (12:36 IST)
ఒత్తిడి లేదా టెన్షన్.. ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఈ ఒత్తిడి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. ఏదేని సందర్భంలో తీవ్రమైన ఒత్తిడికి లోనైపుడు కొన్ని క్షణాలు లేదా నిమిషాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
* ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిలబడాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకుని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. 
* ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని లేదా బొమ్మను కాసేపు అలానే చూడాలి. 
* కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. 
* ఏదీ కుదరకపోతే కళ్ళు మూసుకుని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఊహించుకోండి. 
 
* ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వుని మించిన దివ్య ఔషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్‌ అనే రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడటమో చేయవచ్చు. 
 
* శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో, రబ్బర్‌ బాల్‌ని చేత్తో నొక్కడమో, వేడినీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో... ఉద్వేగం నుంచి తప్పుకుండా దూరం చేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగులో అవి కలిపి తీసుకుంటే... అధిక బరువు తగ్గుతుందా...