నుదుటిపై మూడు మడతలు ఉంటే...
గతంలో గుండెపోటు 50 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవలి పరిస్థితులు చూస్తుంటే.. వృద్ధులకే గుండెపోటు వస్తుందనే నమ్మకం సడలి పోతోంది.
గతంలో గుండెపోటు 50 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవలి పరిస్థితులు చూస్తుంటే.. వృద్ధులకే గుండెపోటు వస్తుందనే నమ్మకం సడలి పోతోంది. చిన్న వయసులో కూడా గుండెపోటు రావచ్చనే భయం పట్టుంది. వయసుతో సంబంధం లేకుండా గుండెజబ్బుల బారినపడుతున్న కేసులు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి.
గుండెపోటు విషయంలో ప్రస్తుతం అన్ని అంచనాలూ తారుమారవుతున్నాయి. గుండె జబ్బుల గురించి ఇటీవలి అనుభవాలు, ఘటనలు పాత అభిప్రాయాల్ని మార్చేస్తున్నాయి. చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం, అది గుండెపోటుకు దారితీయడం ఇటీవల కాలంలో పెరిగిపోతూనే ఉంది. శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు సంభవిస్తున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా, ఇపుడో కొత్త విషయాన్ని వైద్యులు వెల్లడించారు. ఫ్రాన్స్‌కు చెందిన హాస్పిటలైర్ యూనివర్సిటైర్ డి టోలౌజ్ పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో... నుదుటిపై ముడతలు ఎంత లోతుగా ఉంటే.. ఆ మనిషికి అంత తీవ్రమైన గుండెజబ్బు ఉన్నట్లు భావించాలని వారు అంటున్నారు. అది ప్రాణాలు తీసేంత ప్రమాదంగా గుర్తించాలని చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 3200 మందిని ఎంచుకొని వారి జీవన శైలి, నుదుటిపై ఏర్పడిన ముడతలను దాదాపు 20 ఏళ్లపాటు గమనించారు. రెండు, మూడు ముడతలు ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చేందుకు పదిరెట్లు ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించారు.