Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది...(video)

Advertiesment
dates
, బుధవారం, 9 అక్టోబరు 2019 (12:32 IST)
ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి ఇంకెలా మేలు చేస్తాయంటే..
 
ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలను మేలు చేస్తాయి. చెడు కొలస్ట్రాల్‌‌‌ను తగ్గిస్తాయి. అసిడిటీని అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పీచు అరుగుదలకు సాయపడుతుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది.
 
ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఏవైనా పండ్లతోపాటు తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు పెరగాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. వీటిలో ఇనుము శాతం కూడా ఎక్కువే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత దరిచేరదు.
 
విటమిన్లు, ఖనిజాలు మాంసకృత్తులు ఖర్జూరాల్లో సమృద్ధిగా లభిస్తాయి. రోజూ కనీసం నాలుగైదు తీసుకోవాలి. తీసుకున్న వెంటనే తక్షణ శక్తి అందుతుంది. అలసట దూరమవుతుంది. అందుకు ఖర్జూరాల్లోని గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌‌‌లు కారణం.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట...