వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట...

బుధవారం, 9 అక్టోబరు 2019 (11:41 IST)
వ్యాయామం చేయడం వలన ఏన్నో లాభాలు ఉన్నాయి.  చిన్నదైనా చాలు వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేయడం కేవలం శరీరానికే కాదు, మెదడుకు కూడా. 
 
వ్యాయామం చేయడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా అధ్యనాలు చెబుతున్నాయి. తొక్కటం వంటి ఒక మాదిరి వ్యాయామాలతోనూ జ్ఞాపకశక్తి ఎంతగానో మెరుగుపడుతున్నట్టు తాజా ప్రయోగ పరీక్షలు చెబుతున్నాయి. 
 
ముఖ్యంగా మతిమరుపుతో సతమతమవుతున్న వృద్ధులకైతే ఇంకా ఎంతో మేలు చేస్తుండటం గమనార్హం. వ్యాయామాలను ఆరు నెలల పాటు చేసినా మెదడు వయస్సు సుమారు 9 సంవత్సరాలు తగ్గినంత సమానంగా ఫలితం చూపుతుండటం విశేషం. దీంతో ఏకాగ్రత, ప్రవర్తన అదుపు, పనులు సక్రమంగా చేసుకోవటం వంటివి గణనీయంగా మెరుగుపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక వ్యాయామాలకు పండ్లు, కూరగాయలు తినటం కూడా తోడైతే ప్రభావం మరింత పుంజుకుంటోంది కూడా.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయవచ్చా?