Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురిచేసే దగ్గును వదిలించుకునేదెలా?

Advertiesment
శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురిచేసే దగ్గును వదిలించుకునేదెలా?
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:34 IST)
దగ్గు. చాలా ఇబ్బందిపెట్టే సమస్య. శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. శరీరంలో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. వాతావరణ మార్పుల వలన, చల్లటి పానీయ తాగడం వలన శ్వాస క్రియకు ఆటంకం ఏర్పడి దగ్గు ఏర్పడుతుంది. 
 
దగ్గులో కఫం లేని పొడి దగ్గు, మామూలు కఫంతో కూడిన దగ్గు, రక్త కఫంతో కూడిన దగ్గు అంటూ పలు రకాలుగా ఉన్నాయి. శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురిచేసే ఈ దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానాలి.
 
తమలపాకులో మిరియాలు, గుండపోక, వామపువ్వు, పచ్చ కర్పూరం, జాజికాయ ఉంచుకుని దవడన పెట్టుకుని నమలకుండా ఆ రసాన్ని మాత్రమే మింగుతూ వస్తే రెండు పూటలకే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
ప్రతిరోజూ వేన్నీళ్లు తాగితే కూడా దగ్గు తగ్గుతుంది. అలానే కొన్ని మిరియాలను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలలో గానీ, అన్నంలో వాడి కలిపి తింటే దగ్గు నుండి విముక్తి లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్.. సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పేయండి.. 15 నిమిషాలు..?