Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందా...?!!

అన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషధం గుమ్మడి గింజలు. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిళ్లు ఉంటుందా? ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి.

గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందా...?!!
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (15:54 IST)
అన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషధం గుమ్మడి గింజలు. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిళ్లు ఉంటుందా? ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. ఇటు వంటలకు అద్భుతమైన రుచి, అటు అనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడికాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు. 
 
అయితే అలా పారవేసే గుమ్మడి గింజల్లో వైద్యపరమైన ఔషధ గుణగణాలు తెలుసుకొన్నాక ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే, ఈ అద్భుతమైన ప్రయోజనాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, మరియు మినరల్స్ ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి, ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి. వీటిని వారి యొక్క రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే.
 
ఈ గింజల విషయంలో తప్పకుండా గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్య విషయమేమిటంటే, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకానికి గురికావల్సి ఉంటుంది. కాబట్టి, గుమ్మడి గింజలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకొనే వారు, ఎక్కువగా నీళ్ళు, పండ్ల రసాలు తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడియో గేమ్స్‌ ఆడే పిల్లల్లో ఆ లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయట... నెగటివ్ యాక్షన్స్ పెరుగుతాయట!