Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడియో గేమ్స్‌ ఆడే పిల్లల్లో ఆ లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయట... నెగటివ్ యాక్షన్స్ పెరుగుతాయట!

Advertiesment
వీడియో గేమ్స్‌ ఆడే పిల్లల్లో ఆ లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయట... నెగటివ్ యాక్షన్స్ పెరుగుతాయట!
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (15:23 IST)
పిల్లలు వీడియో గేమ్‌లకే అతుక్కుపోతున్నారా? అవుట్‌డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్‌కే పరిమితం అవుతున్నారా? అయితే వారిలో ఫీలింగ్స్ తగ్గిపోతాయని పరిశోధనలో వెల్లడైంది. వీడియోగేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ చేస్తున్నారు. వయొలెన్స్‌ వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల విపరిణామాలు సంభవిస్తాయని తాజా పరిశోధనలు తెలిపాయి. 
 
వీడియో గేమ్స్‌ ఆడటం పిల్లలకు భలే సరదా. ఒక్కసారి వయొలెన్స్‌ వీడియో గేమ్స్ (తుపాకీతో షూట్‌ చేయటం, కత్తి, గొడ్డలి.. లాంటి వాటితో యుద్ధాలు చేయటం)కు అలవాటు పడితే ఇక అంతే సంగతులని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియో శాంటా బార్బరా, యూనివర్శిటీ ఆఫ్‌ బఫెలో పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి వీడియోగేమ్స్‌ ప్రతిరోజూ ఆడటం వల్ల ఎవరైనా సరే వారిలో హింసా ప్రవృత్తి గణనీయంగా పెరుగుతుందని వారు అంటున్నారు.
 
ఒక్కమాటలో భావోద్వేగాల పరంగా ఎలాంటి మార్పులు ఉండవట, అసలు వారిలో గిల్టీ ఫీలింగ్‌ అనేదే మనసులో ఉండదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పదే పదే వయొలెంట్ వీడియో గేమ్స్ ఆడటం ద్వారా పిల్లల్లో దయ, జాలి, కరుణ లాంటి మంచి లక్షణాలు బాగా తగ్గిపోతాయని పరిశోధకులు వాపోతున్నారు. అంతేగాకుండా విపరీతమైన కోపం, గొడవకు దిగే నైజం అలవాటవుతుంది, వీటితో పాటు నెగెటివ్‌ యాక్షన్స్‌ ఉంటాయి. ముఖ్యంగా వీడియోగేమ్స్‌లో మాదిరే తాను చేస్తే పోలా అనే ఆలోచన వచ్చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒబిసిటీకి చెక్ పెట్టే టమోటాతో ఫిష్ ఫ్రై ఎలా చేయాలి?