గసగసాలు అతిగా వాడితే పురుషుడికి ఏం జరుగుతుందో తెలుసా?
మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. వీటినే గసాలు అని కూడా పిలుస్తుంటారు. గసగసాలు నుండి నల్ల మందును తయారుచేస్తారు. నల్లమందు ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. చైనా దేశంలో నల్ల మందు కోసం యుద్ధాలు కూడా జరిగాయి. ఆ మత్తు నుండి బయట పడటానికి చాలా ఏళ్ళు పట్
Publish Date: Tue, 11 Jul 2017 (20:23 IST)
Updated Date: Tue, 11 Jul 2017 (20:26 IST)
మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. వీటినే గసాలు అని కూడా పిలుస్తుంటారు. గసగసాలు నుండి నల్ల మందును తయారుచేస్తారు. నల్లమందు ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. చైనా దేశంలో నల్ల మందు కోసం యుద్ధాలు కూడా జరిగాయి. ఆ మత్తు నుండి బయట పడటానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇలాంటి గసాలను చాలా అరుదుగా వాడటం మంచిది.గసగసాలను కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది.
గసగసాలు అతిగా వాడటం వలన వీర్య నష్టము జరుగుతుందని చెప్పబడింది. అలాగే లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. గుండె సమస్య ఉన్నవారు గసగసాలు దోరగా వేయించి పంచదార కలిపి ఉదయం, సాయంత్రం అర చెంచాడు తీసుకొంటే గుండెకు మంచిది.
కడుపులో మంట ఉన్నవారు, ఎసిడిటీ వున్న వారు దీనిని వాడితే పేగులలోని పుండు కూడా తగ్గుతుంది. గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి వుంటాయి. తరుచు వేడి చేసేవారు వీటిని వాడటం వలన వేడి తగ్గుతుంది. విరేచనాలు అవుతున్నప్పుడు గసగసాలను దోరగా వేయించి నీటితో కలిపి నూరి ఆ రసాన్ని తేనెతో గాని లేక పంచదారతో కాని తీసుకోవాలి.