Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊబకాయాన్ని దూరం చేసే చిట్కాలు.. దానిమ్మ జ్యూస్ మాత్రం వద్దు..

ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే... ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఉదయం పూట తప్పకుండా గ్రీన్ టీని సేవించాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగిలిన అన్ని రకాల పండ్ల జావలను తీసుకోవచ్చు. కాఫీ మాత్రం రోజుకు ఒక

ఊబకాయాన్ని దూరం చేసే చిట్కాలు.. దానిమ్మ జ్యూస్ మాత్రం వద్దు..
, బుధవారం, 12 జులై 2017 (09:10 IST)
ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే...  ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఉదయం పూట తప్పకుండా గ్రీన్ టీని సేవించాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగిలిన అన్ని రకాల పండ్ల జావలను తీసుకోవచ్చు. కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి. ఉదయం పూట గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకుని పరగడుపున తాగాలి. అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు.
 
క్యారెట్‌ను తక్కువ మోతాదులో తీసుకోవాలి. వైట్ పాస్తా, బంగాళాదుంపలను దూరం పెట్టాలి. గోధుమ పాస్తా, గోధుమ బ్రెడ్‌ను తీసుకోవచ్చు. రాత్రి ఏడు దాటితే తినడం మానేయాలి. తక్కువగా ఫ్యాట్‌ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు.
 
అధిక బరువు ఉన్నవారు భోజనానికి అరగంట ముందు వీలున్నన్ని మంచినీళ్ళు త్రాగితే ఆకలి ప్రభావం తగ్గి పరిమితంగా ఆహారం తీసుకుంటారు. అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత అరగంటకోమారు కనీసం అరలీటరు చొప్పున నీరు తాగటం వల్ల త్వరగా ఆకలి కాకపోవటమే గాక ఒంట్లో చేరిన వ్యర్ధాలు, మాలిన్యాలు సులభంగా బయటకి పోతాయి.
 
భోజనం పేరుతో ఒకసారే ఎక్కువ ఆహారం తినటం కంటే విడతల వారీగా తగిన విరామం ఇచ్చి తీసుకుంటే ఆహారం మీద అదుపు ఉంటుంది. అధిక బరువు బాధితులు పగలు కప్పు అన్నం, ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు, రాత్రిపూట ఒక చపాతీ, కాస్త కూరతో సరిపెట్టాలి. హడావుడిగా భోజనం చేయటం, నమలకుండా మింగటం వంటి అలవాట్లు మానుకోవాలి. భోజన సమయంలో నెమ్మదిగా ప్రశాంతంగా ఆహారాన్ని నమిలి చక్కగా ఆస్వాదిస్తూ తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకో కప్పు అది తాగితే మరణ ప్రమాదం తక్కువట.. తాగండి బాబులూ..