Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజుకో కప్పు అది తాగితే మరణ ప్రమాదం తక్కువట.. తాగండి బాబులూ..

రోజుకు కనీసం ఓ కప్పు అయినా సేవిస్తే అన్ని రకాల జబ్బులను నివారించడమే కాకుండా మరణ భయం కూడా తగ్గిపోయే అద్భుతమైన వేడి పానీయమట అది. కాబట్టి వాళ్లూ వీళ్లూ చెప్పే మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నిక్షేపంగా దాన్ని సేవించవచ్చని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్

Advertiesment
రోజుకో కప్పు అది తాగితే మరణ ప్రమాదం తక్కువట.. తాగండి బాబులూ..
హైదరాబాద్ , బుధవారం, 12 జులై 2017 (06:47 IST)
రోజుకు కనీసం ఓ కప్పు అయినా సేవిస్తే అన్ని రకాల జబ్బులను నివారించడమే కాకుండా మరణ భయం కూడా తగ్గిపోయే అద్భుతమైన వేడి పానీయమట అది. కాబట్టి వాళ్లూ వీళ్లూ చెప్పే మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నిక్షేపంగా దాన్ని సేవించవచ్చని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నాళ్లుగా వైద్యులు ప్రపంచ వ్యాప్తంగా హెచ్చరిస్తూ వచ్చినట్లు  రోజుకు రెండు, మూడు కప్పుల వరకు ఆ పానీయం తాగినా ప్రమాదం లేదటం. పైగా మరణ ప్రమాదం మరింత తగ్గుతుందని వీరంటున్నారు. కాబట్టి ఈ పానీయాన్ని ఇన్నాళ్లూ సేవిస్తూ వచ్చినవారు ఇక నిక్షేపంగా కాస్త ఎక్కువే లాగించవచ్చట.
 
గుండె జబ్బులు మొదలుకుని కేన్సర్, మధుమేహం, శ్వాస, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రాణాలకొచ్చే ముప్పుకు కాఫీకి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు పరిశోధకులు. కాఫీ ఎక్కువగా తాగితే ఆయుష్షు పెరుగుతుందా, అన్ని రకాల వ్యాధుల నుంచి ప్రాణాలకు వచ్చే ముప్పు తగ్గుతుందా.. అంటే అవుననే అంటున్నారు ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు. దాదాపు 2.15 లక్షల మందిపై జరిపిన అధ్యయనం ద్వారా తెలిసిందని వెరోనికా సెటీవాన్‌ తెలిపారు. ఇతరులతో పోల్చినప్పుడు రోజుకో కప్పు కాఫీ తాగే వారికి మరణం సంభవించే అవకాశం 12 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రెండు మూడు కప్పులు తాగే వారి విషయంలో ఈ సంఖ్య 18 శాతమని చెప్పారు. 
 
సాధారణ, కెఫీన్‌ రహిత కాఫీల్లో దేన్ని తీసుకున్నా ప్రభావం మాత్రం ఒకే తీరున ఉందని చెప్పారు. కాఫీతో కొన్ని రకాల కేన్సర్లు, మధుమేహం, లివర్‌ సంబంధిత వ్యాధులను నివారించవచ్చని గతంలో ఒక అధ్యయనంలో తేలినప్పటికీ.. ప్రాణాలకు వచ్చే ముప్పు తగ్గుతుందని విశ్లేషించిన తొలి అధ్యయనం మాత్రం ఇదేనని సెటివాన్‌ తెలిపారు. ఈ అధ్యయనం నాలుగు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిపై జరిగిందని.. కాబట్టి ఇది ప్రజలందరికీ వర్తిస్తుందని చెప్పారు.
 
ఇంకేం మరి ఉదయం, సాయంత్రం, రాత్రి కాఫీ రాగాన్ని ఆలపిస్తూ నిక్షేపంగా కాఫీని సేవించండి. భయపడాల్సిన పనే వద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గసగసాలు అతిగా వాడితే పురుషుడికి ఏం జరుగుతుందో తెలుసా?